ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్ధిల్లాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:37 PM

తెలుగు భాషా దినోత్సవం రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులను నేడు తలచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని ట్విటర్ వేదికగా చంద్రబాబు తెలిపారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యతను మనం తీసుకుందామన్నారు. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలుగు వెలగాలని.. తెలుగు భాష వర్థిల్లాలని కోరుకుంటూ దాని కోసం పని చేద్దామని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com