అనుమతులు లేకుండా కొండల తవ్వకాలు చేపడితే చట్టపర మైన చర్యలు తీసు కుంటామని శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు తహసీల్దార్ పి.బాల హెచ్చరిం చారు. తవ్వకాలు జరుగు తున్న అనంతగిరి కొండ ప్రదేశాన్ని బుధవారం పరిశీలించారు. ఎవరి ఇష్ట మొచ్చినట్లు వారు కొండలు తవ్వితే పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. బాధ్యుల పై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు ఆమెను కలిసి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చా రని, ఇళ్ల స్థలాలిస్తామని చెప్పి ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేశారని వినతి పత్రం అందించారు. ఆర్‌ఐ పవిత్ర, సర్వేయర్ తిరుపతిరావు, టీడీపీ నాయకుడు ధరుర్యోధన రెడ్డి పాల్గొన్నారు.