తప్పుడు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన కౌతాళం తహసీల్దార్ మల్లికార్జున స్వామిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాగిరి చంద్రప్ప మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లగొడ్డి శ్రీనివాసులు ఆదోనిలోని ఆది ఆంధ్ర పురపాలక ప్రాథమిక పాఠశాల సదాపురంలో ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తూ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నందుకు అధికారులు సస్పెండ్ చేశారు. విచారణ నిమిత్తం నల్లగొడ్డి శ్రీనివాసులును కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అధికారులు ఆదేశించారు. కౌతాళం మండలం బదినేహాల్ గ్రామంలో నివాసం లేకు న్నా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎస్సీ కులానికి చెందిన ఈయనకు స్థానిక రెవెన్యూ అధికారుల అందదండలతో కాసులకు కక్కుర్తి పడి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తహసీల్దార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ స్టూడెం ట్ అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి మధుకృష్ణ, టీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ, ఎస్సీ, ఎస్టీ నాయకులు రాజీవ్ పాల్గొన్నారు.