గ్రామాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 5), గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసి స్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. పట్టణాల్లోని సచివాలయాల్లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డవలప్‌మెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్, అడ్మిస్ట్రేటివ్, మహిళా పోలీస్, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, ఎమెనిటీస్, శానిటేషన్ అండ్ ఎన్విరాన్ మెంట్, రెవెన్యూ, హెల్త్ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్‌లు ఉన్నారు. వీరి సర్వీసు రిజిస్టర్లు వగైరా ఆయా డిపార్టుమెంట్ల పరిధిలోనే ఉంటాయి. అయితే రూరల్ ప్రాంతాల్లో ఇంజనీ రింగ్ అసిస్టెంట్, హార్టికల్చర్, ఫిషరీష్ అసిస్టెంట్‌లను మాతృ శాఖలకు పంపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయాల్లో పనిచేయడం లేదు. దీంతో వీళ్లు విద్యుత్‌శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వార్డు సచి వాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్య దర్శి, శానిటేషన్ కార్యదర్శి, ఏఎన్‌ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను కొనసాగిస్తారు. మిగిలిన వారిని మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగిస్తారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశు సంవర్ధక సహాయకుల పోస్టులను ఇకపై రద్దు చేయనున్నారు. వారిని క్లస్టర్ విధానంలో మాతృశాఖల అధీనంలోకి తీసుకెళ్తారు.