ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని మా నాయకుడు చంద్రబాబు చెప్పారు అని నారా లోకేష్ అన్నారు. ఆయన ఆదేశాల మేరకు అప్పుడు, ఇప్పుడు కూడా నా పర్యటన సందర్భంగా టీ, మంచినీటి బాటిల్‌కు సొంత సొమ్ము వినియోగిస్తున్నా. కారు డీజిల్ కూడా సొంత సొమ్ముతోనే కొట్టించా. మంత్రిగా హోటల్లో కాకుండా సొంత బస్సులో ఉన్నా. మాజీ సీఎం జగన్ మాదిరిగా ప్రజాధనం లూటీ చేయడం మాకు రాదు. అందుకు మేం వ్యతిరేకం అని తెలిపారు.