నూజివీడు ట్రిపుల్ ఐటీలోని పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ జేడీ ఎన్.మల్లీశ్వరి గురువారం క్యాంప్‌సలో విచారించారు. మంత్రులు లోకేశ్, పార్థసారథి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే క్యాంప్‌సకు వచ్చిన మల్లీశ్వరి... అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ట్రిపుల్ ఐటీలోని మెస్‌లు, క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. మెస్‌ల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, భోజన నాణ్యత సరిగా లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందించనున్నట్లు ఆమె తెలిపారు. ట్రిపుల్ ఐటీని మహిళా కమిషన్ గౌరవ సభ్యులు వి.వినీత, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ డాక్టర్ రాజేంద్ర, సీడీపీవో వై.నూరాని సందర్శించి ట్రిపుల్ ఐటీ అధికారులతో చర్చించారు.