ధర్మవరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ హరీశ్, డోల రాజారెడ్డి పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఏపీని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.