కృష్ణానది తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఈ జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది.జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగుల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 213.88 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 68,664 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ కి 3,14,800 క్యూసెక్కుల భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి 3,31,521 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 16,721 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.