కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. భారీ ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 3.27 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తొంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 215.8 టీఎంసీలుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్‌కు 2.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే నీటిని బయటకు వదులుతున్నారు.