భార్య కారులో 500 గ్రాముల గంజాయి పెట్టి ఆమెను నేరస్తురాలిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సింగపూర్ వాసికి కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన భార్యకు నేర చరిత్ర ఉంటే విడాకులు తీసుకోవచ్చనే ఉద్దేశంతో అతడు ఇలా చేసినట్లు వార్తా కథనాలు తెలిపాయి. దీనిపై తన గర్ల్‌ఫ్రెండ్‌తో "పర్ ఫెక్ట్ క్రైమ్" అని సదరు వ్యక్తి గొప్పలు చెప్పుకున్నాడు. సింగపూర్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష కూడా విధిస్తారు. కారులోని కెమెరా దృశ్యాల ద్వారా నేరం బయటపడింది.