మినపప్పును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మినపప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
మినపప్పును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా మినపప్పు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది. దీని వల్ల షుగర్ బాధితులకు గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.