రామభద్రపురం కూరగాయల మార్కెట్కు తెల్లవారు జాము నుంచే రైతులు, వర్తకులతో రద్దీగా ఉంటుంది. ప్రతియేటా ఆసీళ్ల రూపంలో లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో కనీస వసతులు కల్పించి, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగుల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇవ్వాలనీ, అలాగే దళారీ వ్యవస్థను దూరం చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.