బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు లోని కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుండి గంటసేపు కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ వానలో తడుస్తూనే పాఠశాలకు వెళ్లారు. నాగర్‌కోవిల్‌లోని మీనాక్షిపురం రోడ్డు, అశంబురోడ్డు కోట్టార్ రోడ్డు తదితర రహదారుల్లో వర్షపునీరు వరదలా ప్రవహించింది.