అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న గుంటూరు శ్యామల నగర్ లోని బాల కుటీర్ పాఠశాల లీజును ప్రజాప్రయోజనాలు మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం పొడిగించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు శనివారం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్లో టేబుల్ అజెండాగా ఉన్న బాల కుటీర్ పాఠశాల లీజు అంశం మరియు ఇతర అంశాల పై కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న మనము ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ చట్టాలను ప్రత్యేక నిర్ణయాలను తీసుకుంటాం కాబట్టి బాల కుటీర్ స్కూల్ లీజు అంశం కూడా అలాగే పరిగణించాలి. ఆ స్కూలుకు ప్రత్యేక చరిత్ర ఉన్నది కాబట్టి దాని లీజును పొడిగించాలని కోరుతున్నాను ఎందుకంటే దానిమీద ఆధారపడిన విద్యార్థులు సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం కొన్ని ప్రైవేట్ స్కూల్లో వారు ఆదాయం కోసం ఎంతమంది విద్యార్థులకైనా అడ్మిషన్లు ఇస్తున్న ఈ రోజుల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని లక్ష్యంతో పరిమిత సీట్లతో మరియు ఆ సీటును పొందాలంటే ప్రవేశ పరీక్షల ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సీటును కేటాయిస్తున్నారంటే వారి ఉన్నత లక్ష్యాన్ని, ఆశయాలను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజా ఆమోదం పొందిన బాల కుటీర్ పాఠశాల లీజును పొడిగించాలని, ప్రజాప్రతినిధులు అయినా తాము దీనికి తాను ఆమోదం తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.