కేంద్రమంత్రి, లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కారుకు ఇ-చలానా జారీ అయింది. బీహార్‌లో నిర్ణీత వేగం కంటే అధిక వేగంతో ఆయన కారు వెళ్లడంతో అధికారులు చలానా జారీ చేశారు. హాజీపూర్-చంపరాన్ జాతీయ రహదారిలో ఓ టోల్ ప్లాజాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇ-డిటెక్షన్ సిస్టంలో పాశ్వాన్ కారు వేగంగా వెళుతున్నట్లు గుర్తించారు. అతివేగం కారణంగా ఇ-చలానా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన కారుకు 2 వేల రూపాయల చలానా విధించారు. అయితే ఈ చలానాతో సంబంధం లేదని చిరాగ్ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.బీహార్ రాష్ట్రంలో కొత్త ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా బీహార్ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఆగస్ట్ 7 నుండి 15వ తేదీ మధ్య రూ.9.49 కోట్ల రూపాయల విలువైన 16,700 కోట్ల ఇ-చలానాలు జారీ చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తం 16,755 ఇ-చలానాలలో 7,079 బీహార్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు జారీ చేయగా, మిగతా వాహనాలు ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యాయి