విజయవాడలోని హిందువులకు షాక్ తగిలింది. విజయవాడలో వినాయక చవితి పందిర్ల ఏర్పాటుపై సందిగ్ధం నెలకొందని సమాచారం. వరదలు వర్షాలతో నీట మునిగిన బెజవాడలో ఏడో తేదీన వినాయక చవితి పందిర్ల ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నారట నిర్వాహకులు.గత ఏడాదితో పోల్చితే తక్కువ సంఖ్యలో మాత్రమే అనుమతి కోసం పోలీసులకు అందుతున్నాయట దరఖాస్తులు.72 అడుగుల డూండీ గణేష్ విగ్రహం దగ్గర నడుము లోతు మేర నిలిచింది వరద నీరు. విజయవాడ నగరమంతా జలమయం కావటంతో పాటు ఈ నెల 5, 6 తేదీల్లో మరో మారు వరద వస్తుందనే సంకేతాల నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నారు నిర్వాహకులు. అటు పోలీసులు కూడా పర్మీషన్లు ఎక్కువగా ఇవ్వడం లేదట. వరదలు ఉన్న తరుణం లోనే… పోలీ సులు కూడా పర్మీషన్లు ఎక్కువగా ఇవ్వడం లేదట.