తమ హయాంలో కనీసం రహదారులపై గోతులు కూడా పూడ్చలేని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణకు తనను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ పుట్టిన రోజు వేడుకలకు తాను సింగపూర్ వెళితే పేకాడటం కోసం వెళ్ళానని కొట్టు ఆరోపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నానని, కమీషన్లు తీసుకుంటున్నానని చెప్పిన వారిని మీడియా ముందుకు తీసుకురావాలని, దమ్ముంటే ఓపెన్ డిబేట్కు రావాలని సవాల్ విసిరారు. బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, పాలూరి వెంకటేశ్వరరావు, తోట రాజ, నీలపాల దినేష్ పాల్గొన్నారు.