ముంపునీరు త్వరితగతిన దిగువకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా, జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధికారు లను ఆదేశించారు. ఆకివీడు పరిధిలోని దుంపగడపలో నీట మునిగిన వరిపొలాలను డీఏవో వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఉప్పుటేరు బ్యాక్‌వాటర్ వల్ల వరి పొలాల్లోని నీరు బయటకు వెళ్ళడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన ఉప్పుటేరుపై ఉన్న రైల్వే వంతెన వద్ద పేరుకుపోయిన కిక్కిస, గుర్రపుడెక్క ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రెయినేజీ జేఈ వెంకటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే అధికారులతో తూడు, కిక్కిస తొలగింపుపై చర్చిస్తానని తెలిపారు.