ఎగువ నుంచి పంట, మురుగు కాల్వలకు వరద నీరొచ్చినా ముంపు సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆకివీడు సమతానగర్లోని చెంచుల కాలనీని ఆయన పరిశీలించి మాట్లాడారు. పల్లపు ప్రాంతాలు, కాలనీల ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నా రు. అయి–భీమవరం రోడ్లోని మూలలంక బోదెకు అనుకుని ఉన్న ఆక్రమణదారులకు నోటీసులిచ్చి తొలగించాలని తహాసీల్దార్ నండూరి వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావులను ఆదేశించారు.