పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు. తెలిపారు. పౌష్టికా హార మాసోత్సవాలను బుధవారం మడకశిర , మెళవాయి పంచాయతీ కేంద్రంలో ని అంగనవాడీ కేంద్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పీడీ మా ట్లాడుతూ... గర్భణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంగనవాడీ కార్యకర్తలకు సూచించారు. పౌష్టికాహారంతో పాటు కూరగాయలను కూడా బాగా తీసుకోవాలన్నారు. అందువల్ల కలిగే లాభాలను గురించి వివరించారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ లీలావ తి, అంగనవాడీ కార్యకర్తలు, గర్భిణులు,బాలింతలు పాల్గొన్నారు.ఆకుకూరలు, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరో గ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శంకరమ్మ అన్నారు. పట్టణం లోని తొమ్మిదో వార్డు అంగనవాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్త శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.