పెనుకొండ మండల కేంద్రంలోని అంగనవాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ శాంతలక్షి బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీడీపీఓ మాట్లాడుతూ... అంగనవాడీ కేంద్రాలద్వారా లభించే పోషకాహారం క్రమం తప్పకుండా వాడాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు జంక్ ఫుడ్ పెట్టకూడదని కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు వాడాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పుష్ప, యర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.