చిరుధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెటిం గ్ చేయాలని, అందుకు ప్రోత్సహిస్తామని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కూడేరు, మండలంలోని ముద్దలాపురం గ్రా మ వద్దనున్న రైతు నేస్తం ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ తయారు చేస్తున్న బిస్కెట్లు, చిక్కీలు తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు అనంతపురం పట్టణంలోని ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ జరగనుందని, ఆ సమయంలో అక్కడ ఈ ఉత్పత్తులను విక్రయాలు జరుపుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏ ఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, రైతు నేస్తం ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ మురళీకృష్ణ, నాబార్డు డీడీఎం అనూరాధ, ఇనచార్జి తహసీల్దార్ మహబూబ్ బాషా, డిప్యూటీ తహసీల్దారు విశ్వనాథ్, ఆర్ఐ ప్రసన్నకుమర్ తదితరులు ఉన్నారు.