ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. వైరల్ జ్వరంబారినపడినప్పటికీ ఆయన తన నివాసంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నెలకొనేలా కృషి చేయాలని అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.కాగా, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు సైతం జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.