వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) అంగీకరించింది. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించిన తరువాతే వైయస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశామని ఆ కమిటీ హైకోర్టుకు వివరించింది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, ఆయన ఇంకా బతికే ఉన్నారని, చచ్చే వరకు కొట్టాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మరో టీడీపీ నేత మధ్య సాగిన సంభాషణ కూడా నిజమేనని అంగీకరించింది. ఇవి అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాక ముందు మాట్లాడిన మాటలని తెలిపింది. ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ఈ సంభాషణకు, వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉందనేందుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. వైయస్ జగన్ సొంత వాహనమైన టయోటా ఫార్‌చ్యూనర్‌కు బుల్లెట్ ప్రూఫ్ చేసుకునేందుకు అనుమతినిచ్చామని పేర్కొంది.