వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులను నియమించారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డిలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.