మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి నియెజకవర్గం నుంచి విజయవాడ వరద బాధితులకు గురువారం పాలప్యాకెట్లు, మంచి నీటి బాటిళ్లను తీసుకెళ్లారు. బల్లికురవ మండలం నుంచి వెళ్లిన తెలుగుయువత సభ్యులు వరద ప్రాంతంలో నీటిలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజల వద్దకు జీపుతో వెళ్లి వారికి మంత్రి రవికుమార్ పంపిన పాలప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో దేవినేని నరేంద్ర, అమరనేని వినోద్, అమరనేని కాశీవిశ్వనాధం, వడ్లమూడి వెంకయ్య ఉన్నారు.