విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు సెప్టెంబర్ 6 నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా బాధితులందిరికీ నిత్యావసరాల పంపిణీ చేసేలా ఏర్పాట్లపై గురువారం మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు...ఇవే
25 కేజీల బియ్యం బస్తా
కేజీ కందిపప్పు
కేజీ పంచదార
2 కేజీల ఉల్లిపాయలు
2 కేజీల బంగాళా దుంపలు
లీటరు పామాయిల్‌ను వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు.