వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి ఈ మూడు పేర్లు వారం, పదిరోజుల కిందటి వరకూ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటే.. వినాయకచవితి రోజున దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో ట్విస్ట్ తీసుకుంది. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి దివ్వెల మాధురి అడుగుపెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్వెల మాధురి కనిపించింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చింది. ఈ విషయం తెలిసి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి.. ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది.
టెక్కలిలోని ఇల్లు తమదని చెప్తున్న దువ్వాడ వాణి.. తమ ఇంట్లోకి దివ్వెల మాధురి ఎలా వెళ్తుందంటూ ప్రశ్ని్స్తున్నారు. మాధురిని ఇంటి నుంచి పంపించి వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది. మరోవైపు ఈ వ్యవహారం గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతున్నారు. అయితే తన కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉంటామని దువ్వాడ వాణి చెప్తున్నారు. అయితే ఇందుకు దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించడం లేదు.
ఈ వ్యవహారం ఇలా ఉన్న సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో.. దివ్వెల మాధురి కనిపించడం మరోసారి వివాదానికి కారణమవుతోంది. దివ్వెల మాధురి బాల్కనీలో తిరుగుతూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం కావటంతో వైసీపీ అధిష్టానం ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఇంఛార్జి పదవిని తీసేసింది. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్‍ను తప్పించి.. ఆ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యీ పదవి నుంచి కూడా తప్పించాలని దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.