ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లను ఉపయోగించాలని ఆదేశించారు.
వరద ప్రవహాలు, గట్ల పటిష్టతను అంచనా వేయాలని సూచించారు. విజయవాడలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ముందస్తు చర్యలతోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు.