వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు.
ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తే అంటూ ధ్వజమ్తెతారు. ‘‘మునిగిపోతారని తెల్సి కూడా ప్రజలను వదిలేస్తారా..? విజయవాడ వరద మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే’’ అని ఆరోపించారు.