చంద్రబాబు ‘పూర్ టూ రిచ్’ అన్న నినాదం ఇచ్చారు కానీ, ఇప్పుడు పరిస్ధితి చూస్తే ‘రిచ్ పీపుల్ కూడా పూర్ పీపుల్’ అయ్యారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఈరోజు కృష్ణలంక వాసులు ప్రశాంతంగా ఉన్నారంటే, అందుకు వైయస్ జగన్ నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణమని గుర్తు చేశారు. వరదకు బోట్లు కొట్టుకొచ్చి, ప్రకాశం బ్యారేజీ గేట్లకు తగలడాన్ని కుట్రగా అభివర్ణిస్తూ, తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న మల్లాది విష్ణు.. బోట్లతో బ్యారేజ్‌కు డ్యామేజ్ చేయాలని ఎవరూ కోరుకోరని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిందను ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, విపత్తు సహాయక చర్యల్లో వేగం పెంచాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు ఇకనైనా వరదను రాజకీయం చేయడం మానుకోవాలని, వరదల్లో నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు కోరారు.