288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో BJP 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. CM ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని NCP 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.