వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (11.09.2024) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైల్‌కు చేరుకుంటారు, అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన అనంతరం, అక్కడినుంచి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు, ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.