రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో కేంద్ర బృందంతో భేటీ కానుంది. భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను కేంద్ర బృందానికి సిసోడియా వివరించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే అధికారుల్లో ఒక టీమ్ బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 5.30 వరకు కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనుంది. మధ్యాహ్నం యనమలకుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమును బృందం పరిశీలించనుంది. అనంతరం అక్కడి నుంచి పెద్దపులిపాకలోని దెబ్బతిన్న ఇల్లు, ఉద్యానవనం పంటలు, చోడవరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనుంది. అనంతరం దెబ్బతిన్న రొయ్యూరు కంకిపాడు రోడ్డును అధికారులు పరిశీలించనున్నారు.