తన సీనియర్ అయిన వింగ్ కమాండర్ ఒకరు తనపై లైంగికదాడికి పాల్పడినట్టు మహిళా ఫ్లయింగ్ ఆఫీర్ జమ్మూ కశ్మీర్ లోని బుడ్గామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
గతేడాది డిసెంబర్ 31న నిర్వహించిన పార్టీ అనంతరం గిఫ్ట్ ఇస్తానని రూముకు పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడితో కలిసి విధులు నిర్వర్తించలేనని, తనను బదిలీ చేయాలని కోరారు. కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు.