వైరస్ అని పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది.. కరోనా. ఈ వైరస్ బారిన పడి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో.. ఎలాంటి కష్టాలు అనుభవించారో ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో చైనాలో మరో కొత్త రకం వైరస్ కలకలం రేపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వెట్‌ల్యాండ్ అనే వైరస్ (WELV)ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు.