హిందూపురం ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లకుంటలో బుధవారం టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇందులో వైసిపి జె సి ఎస్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
టిడిపి వర్గీయులు తమపై విచక్షణారహితంగా దాడులకు దిగారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘర్షణలో గాయపడ్డ శివశంకర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.