ఓ పోలీసు అధికారిపై ఇద్దరు యువకులు బహిరంగంగా దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. రవి కశ్యప్ అనే వ్యక్తి రోడ్డుపై మరో వ్యక్తితో గొడవ పడుతుండగా, అక్కడే ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ నాథూరామ్ దోహ్రే జోక్యం చేసుకున్నారు.
ఈ క్రమంలో కశ్యప్, అతడి స్నేహితుడు మనీష్లు పోలీసుపై దాడికి దిగారు. కాలర్ పట్టుకుని పోలీసును కొట్టడంతో పాటు అతడి చొక్కా కూడా చింపి వేశారు. కాగా, ఈ ఘటన అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.