మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలుగా జైలు జీవితం గడిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే 10లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో జరిగే విచారణలకు హాజరుకావాలని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం, అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa