చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు రెండు లారీలు ఢీకొనడంతో ఇప్పటివరకు పలువురు మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.