తాను ఏ తప్పూ చేయకుండానే పోలీసులు స్టేషన్‌కు పిలిపించి తనపై దాడి చేసి గాయపరిచారని టెక్కలి శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఇల్లా గురుప్రసాద్ తండ్రితో కలిసి ఆరోపించాడు. తనపై పోలీసులు దాడిచేశారని, తనకు నొప్పిగా ఉందని జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఎంఎల్‌సీ నమోదు చేసి పోలీసులకు సమాచా రం అందించినా.. వారు స్పందించలేదని వాపో యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వివాహితను వేధిస్తున్నానంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫి ర్యాదు ఇచ్చారనే కారణంతో పోలీసులు పలుమా ర్లు తనను స్టేషన్‌కు పిలిచారని, వినాయక చవితి రోజున కూడా గట్టిగా కొట్టి గాయపరిచారన్నారు. తాను ఎక్స్‌రే తీసుకుని చికిత్స పొందానన్నాడు. శుక్రవారం కూడా పోలీసులు ఇంటికి వచ్చి తన ను స్టేషన్ రావాలని చెప్పడంతో వెళ్లగా.. బూటు కాలితో తన్ని కొట్టారని, దీంతో తట్టుకోలేక ఆసుప త్రికి తన తండ్రి చక్రపాణితో కలిసి చికిత్స కోసం వెళ్లానని చెప్పాడు. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమెకి ఇటీవల పెళ్లి కూడా జరిగిందని, తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను చదువుకున్న యువకుడినని, తనపై అమ్మాయి తల్లిదండ్రులు, పోలీసులు కూడా వరుసగా దాడి చేస్తున్నారని వాపోయాడు. తనకు పోలీసులు కొట్టిన దెబ్బలను మీడియాకు చూపించాడు. ఈ విషయమై సీఐ ఎ.విజయ్ కుమార్ వద్ద ప్రస్తావించగా.. ఆ యువకుడు ఓ వివాహితను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తునకు స్టేషన్‌కు పిలిపించడం జరిగిందన్నారు. ఆ యువకుడి మెంటల్లీ డిజార్డ్ అని వివరించారు.