సాధారరణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బదిలీలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 238 మంది మహిళా పోలీసులు ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 71 మందిని బదిలీ చేయగా 149 మంది యథావిధి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలపగా, 18 మంది గైర్హాజరయ్యారు. ముందుగా మ్యూచువల్ బదిలీలు, స్పౌస్ కోటా, ఆరోగ్యపరమైన సమస్యల ప్రతిపాదికన బదిలీలు చేపట్టారు. ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.అప్పారావు, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి పి.వాసుదేవరావు పారదర్శకంగా కౌన్సెలింగ్ చేపట్టారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.