మండవల్లి మండలంలోని కొల్లేటిలంక గ్రామా లు వారం రోజు లుగా కొల్లేరు వరద నీటిలోనే మగ్గుతున్నాయి. మణు గులూరు, పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామ్ నగర్, ఇంగిలిపాకలంక, నుచ్చుమిల్లి, తక్కిల్లపాడు, చింతపాడు, కొవ్వాడ లంక గ్రామాలు నేటికీ ముంపు నీటిలోనే మగ్గుతున్నాయి. లంక గ్రామాల ప్రజలు పడవలు, బోట్లు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. కొల్లేరు లంక గ్రామాల్లో నీరు తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాములు బెడద బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.