కొల్లేరు, ఉప్పుటేరుల వరద ఉధృతికి ముదినేపల్లి ప్రాంతంలోని మూడు మేజర్ డ్రెయిన్లు స్తంభించాయి. కొల్లేరులో నీటి మట్టం తగ్గక పోవడంతో పోల్ రాజ్ మేజర్ డ్రెయిన్, ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహి స్తుండడంతో పెదకొమ్మిలేరు, చినకొమ్మిలేరు మేజర్ డ్రెయిన్లు, వాటికి సం బంధించిన మీడియం, మైనర్ డ్రెయిన్లలో నీటి ప్రవాహం నిలిచి పోయింది. దీంతో పోల్‌రాజ్, కొమ్మిలేరు పరీవాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లోని సార్వా వరి పైరు ముంపు నుంచి తేరుకోవడం లేదు. పోల్ రాజ్ మేజర్ డ్రెయిన్ కోమటి లంక వద్ద కొల్లేరు సరస్సులో కలుస్తుండగా, పెదకొమ్మిలేరు, చినకొమ్మిలేరు మేజర్ డ్రెయిన్లు తాడినాడ వద్ద ఉప్పు టేరులో కలుస్తాయి. కొల్లేరు, ఉప్పుటేరుల ఉధృతి తగ్గే వరకు ఈ డ్రెయిన్ లో నీరు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఈలోగా వేలాది ఎకరాల్లోని వరి పైరు కుళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.