మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (UBT) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదన్నారు. అహ్మద్నగర్లో ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు ప్రసంగించారు.
సీఎం అభ్యర్థి ఎవరినేది ప్రకటించకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు 'మహావికాస్ అఘాడీ' మిత్రపక్షాలు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తోన్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa