జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా ప్రభుత్వం మార్చింది. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్చింది. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మన బడి - నాడు నేడును మన బడి - మన భవిష్యత్తుగా మార్చారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ను ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చారు. అలాగే 'శాశ్వత భూ హక్కు-శాశ్వత భూ రక్ష' పథకం పేరును 'ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్'గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇవే కాకుండా మరికొన్ని పథకాలకు కూడా పేర్లు మార్చారు.