రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని.. ప్రజల ఇళ్లపై కూటమి నేతలు.. దౌర్జన్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ భ్రష్టు పట్టిందని.. వసూళ్లపై గ్రామాల్లో ఆ పార్టీ నేతలు పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తున్నారు. చంద్రబాబు, పవన్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. భక్తుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ తర్వాత రాజీ కుదుర్చుతున్నారు’’ అని సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.
చంద్రబాబు డీఎన్‌ఏ లోనే దళిత వ్యతిరేక భావం ఉంది. దళితులను అణగతొక్కటం, హింసించటం చంద్రబాబు హయాంలో జరుగుతూనే ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులను సైతం వేధిస్తున్నారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి అత్యంత హేయం. జనసేన ఎమ్మెల్యే నానాజీ దళిత ప్రొఫెసర్ పై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.