ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చురకలంటించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో మద్యం ధరల అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నిర్ణయాలు ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నాయని మండిపడ్డారు.
ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడిసిన్ ఖర్చులు, విద్యా సంస్థల ఫీజులను పరిమితం చేయడానికి బదులుగా.. మద్యం ధరను రూ.99కి పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోంది?. చంద్రబాబు ప్రభుత్వం చర్యలు మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. అలాగే, ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతోంది. అనవసర అంశాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.