శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్‌కు చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా నియమించారు.సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి అమరసూర్య కావడం గమనార్హం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు.అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేశ్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్రను సృష్టించారు