వరద బాధితులకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్థానిక 38వ డివిజన్ లో కుమ్మరపాలెం పరిసర ప్రాంతంలో నివసిస్తు ఇటీవల వచ్చిన వరదలకు కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టపోయిన బాధితులు తమ పేర్లను వరద బాధితుల జాబితాలో పొందుపరచలేదని చెప్పి సచివాలయ సిబ్బందికి, అధికారులకు తమ గోడును వెళ్ళబోసుకున్నారు, వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వరద బాధితులు శాంతియుత నిరసన తెలియజేశారు, నిరసన తెలిపిన వారిపై కూటమి ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించింది వారికీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ వరద భాధితులను నేడు మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు పరామర్శించి అనంతరం సంబంధిత సచివాలయాన్ని సందర్శించి సచివాలయ సిబ్బందితో మాట్లాడి వరద వలన నష్టపోయిన బాధితులందరి పేర్లను జాబితాలో పొందుపరిచవలసిందిగా కోరారు .ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కృష్ణానది కి ఒడ్డున ఉన్న ఇళ్లులు వరదలకు పూర్తిగా మునిగిపోయాయి. సర్వే చేయడానికి కూడా అధికారులను ప్రభుత్వం పంపలేదు..మా ఇంటికి ఎన్యుమరేషన్ జరగలేదని బాధితులు అడిగితే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేశారు..రూ.100 కోట్లు వివిధ రకాలుగా చంద్రబాబుకి విరాళాలు వచ్చాయని గుర్తు చేశారు. కార్పొరేటర్ పరిహారం ఇవ్వొద్దని చెప్పారని ప్రజలను టీడీపీ నేతలు, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు..బాధితులు ఆందోళన చేస్తే సుజనా చౌదరి, ఎంపీ ఒకరైన వొచ్చారా? అని నిలదీశారు.
9లక్షలు క్యూసెక్కుల నీరు వస్తేనే ఇళ్లలోకి నీరు వస్తుంది.. 11 లక్షలు వస్తే ఇంట్లోకి రావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ ఉండి ఏమి చేసాడని ధ్వజమెత్తారు. నష్ట పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. వరద బాధితులకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు ..అధికారులు స్పందించడం లేదు.. డబ్బులు అన్ని దాచుకొంటున్నారని విమర్శించారు. బాధితులకు పరిహారం చెల్లించకపోతే వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రజలకు తోడుగా వైయస్ఆర్‌సీపీ ఉంటుందన్నారు. రోడ్ మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే వరద బాధితులపై కేసులు పెడతాం అంటే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో పశ్చిమ ఇంచార్జ్ షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు , కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.